
కొత్తపల్లిలో ఊహించని కామెడీ జాతరం – రానా దగ్గుబాటి సమర్పణలో జూలై 18న ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ విడుదల
The teaser of rural comedy entertainer Kothapallilo Oka Uppuḍu, produced by Paruchuri Vijaya Praveena Arts and presented by Rana Daggubati’s Spirit Media, offers a playful ride set in a vibrant village backdrop. Actress-turned-director Praveena Paruchuri makes her directorial debut with this film, showcasing the charm and humour of rural life.
రానా దగ్గుబాటి సమర్పణలో వస్తున్న ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పల్లెటూరి జీవితం, కలలు, నాటకీయత అన్నీ కలిసిన ఈ కథలో మనోజ్ చంద్ర యువ డ్యాన్స్ మాస్టర్ పాత్రలో కనిపిస్తాడు. తనకు డ్యాన్స్ పార్ట్నర్ కావాలనే తపనలో ఊహించని అవాంతరాలను ఎదుర్కొంటాడు.
టీజర్ చూస్తుంటే కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రస్టిక్ టోన్‌లో కామెడీ, ఎమోషన్, సరదా—all-in-one ఫీల్‌ను అందిస్తుందనే సంకేతాలిస్తున్నాయి. డైరెక్టర్ ప్రవీణ పరుచూరి నెరేషన్‌లో నేచురల్ హ్యూమర్‌తో పాటు పల్లె దృశ్యాల్ని హృదయానికి హత్తుకునేలా చూపించారు.
సినిమాటోగ్రాఫర్ పెట్రోస్ ఆంటోనియాడిస్ గ్రామీణ వాతావరణాన్ని అందంగా పకడ్బందీగా క్యాప్చర్ చేయగా, మణిశర్మ మ్యూజిక్ & వరుణ్ ఉన్ని BGMతో టీజర్ మూడ్‌ను ఎలివేట్ చేశారు. మోనికా టి, ఉషా బోనెల, రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి వంటి నటీనటుల ప్రదర్శన సహజంగా ఆకట్టుకుంది.
‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా జూలై 18న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.