సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్ష, వామపక్ష, విద్యార్థి,యువజన,ప్రజా సంఘాలు హజరయ్యాయి.
వైఎస్ షర్మిల మట్లాడుతూ రాజకీయాలకు,సిద్ధాంతాలను పక్కన పెట్టి కలిసి పోరాటం చేస్తున్నాం. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలకోసం పోరాడటం మన నైతిక భాధ్యత. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ను మనం కాపాడే వాళ్ళం అవుతాం. అందుకే టీ సేవ్ ఫోరం ఏర్పాటు చేశాం. టీ సేవ్ ద్వారా ఉద్యోగాలు,విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్,హాస్టళ్లలో వసతులు తదితర అంశాల విూద పోరాటం చేస్తాం. తెలంగాణ లో కొత్త జిల్లాలు,కొత్త మండలాలు ఏర్పడి దాదాపు 3.85లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. బిస్వాల్ కమిటీ రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. కానీ కేసీఅర్ అసెంబ్లీ లో నిలబడి 80 వేల ఉద్యోగాలు భర్తీ అని రెండేళ్ల క్రితం చెప్పాడు. 80 వేల ఉద్యోగాలు అని ఇప్పటి వరకు 43 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ లు ఇచ్చారు. 80 వేల ఉద్యోగాలలో ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదని అన్నారు.
పేపర్ లీకుల కారణంగా గ్రూప్ 1 లాంటి పరీక్షలు గందరగోళం లో పడ్డాయి. ఉద్యమంలో ఇంటికి ఒక ఉద్యోగం అని కేసీఅర్ హావిూ ఇచ్చాడు. గ్రూప్ 1 పోస్టులకు పరీక్షలు రాయోద్దు అన్నారు. కేసీఅర్ మెడలు వంచాల్సిన అవసరం ఉంది. ఈ నెల 17 న 48 గంటల పాటు నిరాహార దీక్ష చేద్ధమని అన్నారు.