కేసీఆర్ నీ గుండెలపై రాసి పెట్టుకో… 2034 వరకు నేనే సీఎం — జటప్రోలోని సభలో రేవంత్ రెడ్డి ధీమా ప్రకటన”Palamuru boy will lead the state till 2034,” declares CM Revanth Reddy at Jetprole, attacking KCR for opposing welfare and development in backward regions.

కేసీఆర్ నీ గుండెలపై రాసి పెట్టుకో… 2034 వరకు నేనే సీఎం — జటప్రోలోని సభలో రేవంత్ రెడ్డి ధీమా ప్రకటన
“Palamuru boy will lead the state till 2034,” declares CM Revanth Reddy at Jetprole, attacking KCR for opposing welfare and development in backward regions.

పాలమూరు జిల్లా జటప్రోల్‌లో జరిగిన “ప్రజాపాలన – ప్రగతిబాట” సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2034 వరకూ తానే సీఎంగా కొనసాగుతానని ధీటుగా ప్రకటించిన ఆయన, కేసీఆర్‌కి వచ్చే దుఃఖం రైతుల సంతోషం వల్లేనని చెప్పారు. బలహీన వర్గాల పిల్లల కోసం 25 ఎకరాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు.

“పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తా. మా రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా. మేము బతకాలంటే సహకరించండి. వినకపోతే పోరాటం చేయడం మాకు తెలుసు,” అని హెచ్చరించారు.

కేసీఆర్ పాలమూరును చిన్నచూపుగా చూస్తున్నాడని ఆరోపించిన రేవంత్, పదేళ్ల సీఎంగా ఉన్నా పాలమూరు ప్రాజెక్టులపై ఎలాంటి దృష్టి పెట్టలేదన్నారు. వాల్మీకి సోదరుల అంశంలో మోసం చేశారని విమర్శించారు. మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయడం వల్లే కేసీఆర్‌కు కళ్లలో నీళ్లు వచ్చాయా? అని ప్రశ్నించారు.

“కళేశ్వరం మూడు ఏళ్లలో కూలేశ్వరం అయింది. కానీ మేము పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తాం. అభివృద్ధిని చూసి అభినందించాల్సిన స్థితిలో మీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు,” అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కొల్లాపూర్ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వం ధైర్యంగా ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *