317 జీవో ప్రవేశపెట్టిన కేసీఆర్ పై టీచర్లు కసి తీర్చుకున్నారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ గా ఏ.వి.ఎన్ రెడ్డి గారిని గెలిపించారు. పాలమూరు గడ్డ మీద నుండి క్లాక్ టవర్ సాక్షిగా చెబుతున్నా కేసీఆర్… నీకు కౌంట్ డౌన్ స్టార్టయ్యిందిని అన్నారు. తనకు జైలు కొత్తకాదు. 9 సార్లు జైలుకు వెళ్ళొచ్చానని గుర్తుచేశారు. మొన్న నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంటే అర్ధరాత్రి నన్ను అరెస్టు చేసి 8 గంటలు తిప్పారు. కేసీఆర్ అవినీతి, మూర్ఖత్వపు పాలనను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నా… అందుకు ఎన్ని సార్లయినా జైలుకు పోతనన్నారు.