కేజీఎఫ్ తరువాత యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌కు వచ్చిన స్పందన మధ్య, ఈ సినిమా కోసం యష్ భారీ పారితోషికం అందుకున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

After the success of KGF, expectations are soaring for Yash’s upcoming film ‘Toxic’. Amid strong teaser response, reports of a massive remuneration have sparked industry buzz.

కేజీఎఫ్ తరువాత యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌కు వచ్చిన స్పందన మధ్య, ఈ సినిమా కోసం యష్ భారీ పారితోషికం అందుకున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

After the success of KGF, expectations are soaring for Yash’s upcoming film ‘Toxic’. Amid strong teaser response, reports of a massive remuneration have sparked industry buzz.

కన్నడ స్టార్ Yash హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. లేడీ డైరెక్టర్ Geetu Mohandas పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా KGF: Chapter 2 వంటి భారీ విజయానంతరం యష్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా కోసం యష్ దాదాపు మూడు సంవత్సరాలు వెయిట్ చేసినట్టు సమాచారం. కేజీఎఫ్ తరువాత ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు యష్ సుమారు రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా నిర్మాణంలో భాగస్వామ్యుడిగా ఉన్న కారణంగా లాభాల్లోనూ వాటా పొందనున్నాడని తెలుస్తోంది. లాభాల ద్వారా అదనంగా రూ.100 కోట్ల వరకు వచ్చే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మొత్తంగా ఈ చిత్రంతో యష్ రూ.150 కోట్ల వరకు ఆదాయం పొందవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే, అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది. మూడు సంవత్సరాల విరామం తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

‘Toxic’, directed by Geetu Mohandas, is being mounted as a pan-India project with multiple leading actresses. The teaser has generated strong online buzz for its high-scale action and visuals. The film is slated for release on March 19.

Industry reports suggest that Yash has received around ₹50 crore as remuneration and may earn additional profit share up to ₹100 crore, as he is reportedly associated with the production. While no official confirmation has been made, the figures have become a major talking point in film circles.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *