కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం (8th Pay Commission) అమలుపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు కొత్త వేతన సంఘం అమలును ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం (NC-JCM) సమావేశంలో ఉద్యోగుల జీత సవరణపై కీలక డిమాండ్లు ముందుకు వచ్చాయి.
A major discussion on the implementation of the 8th Pay Commission has emerged, bringing fresh expectations for millions of central government employees and pensioners across India. During the National Council–Joint Consultative Machinery (NC-JCM) meeting held in February, employee unions raised significant demands regarding salary revision.
ఉద్యోగుల సంఘాలు కుటుంబ యూనిట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 3 నుంచి 5కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం కనీస వేతనం లెక్కించేటప్పుడు కుటుంబ యూనిట్లను మూడు—భర్త, భార్య, ఇద్దరు పిల్లలు—గా పరిగణిస్తున్నారు. అయితే మారుతున్న కుటుంబ బాధ్యతలు, ముఖ్యంగా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన చట్టపరమైన బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని మరో రెండు యూనిట్లు చేర్చాలని సంఘాలు కోరుతున్నాయి.
Employee unions have demanded that the number of family units considered for minimum wage calculations be increased from the current three to five. At present, wage calculations assume three family units—husband, wife, and two children. However, unions argue that growing responsibilities, including the legal obligation to support parents, require expanding the family unit structure.
ఈ డిమాండ్ ఆమోదమైతే 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ యూనిట్ల సంఖ్యను 3 నుంచి 5కు పెంచితే బేసిక్ పే లెక్కింపులో సుమారు 66 శాతం వరకు పెరుగుదల వచ్చే అవకాశముందని అంచనా. దీంతో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.0 కంటే ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు.
Experts say that if the proposal is accepted, the fitment factor under the 8th Pay Commission may also increase significantly. Increasing family units from three to five could raise the basic pay calculation by nearly 66 percent. As a result, the fitment factor might exceed 3.0.
ప్రస్తుతం 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస బేసిక్ పే రూ.18,000గా ఉంది. అయితే 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3గా నిర్ణయిస్తే కనీస వేతనం సుమారు రూ.54,000 వరకు చేరే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.25గా ఉంటే కనీస వేతనం రూ.58,500 వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
Under the current 7th Pay Commission, the minimum basic pay for central government employees stands at ₹18,000. If the fitment factor is fixed at 3 under the 8th Pay Commission, the minimum salary could reach around ₹54,000. If the factor rises to 3.25, the minimum pay may go up to nearly ₹58,500.
అదేవిధంగా ఈ మార్పులు అమలులోకి వస్తే పెన్షనర్లకు కూడా గణనీయమైన పెన్షన్ పెరుగుదల ఉండే అవకాశముంది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే విషయంపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది.
Similarly, if these changes are implemented, pensioners are also expected to receive a substantial increase in pension benefits. Employees are now closely watching the government’s response to the unions’ demands.