కెసిఆర్ పాలనలో దేశమే అబ్బురపడేలా తెలంగాణలో అభివృద్ధి కొనసాగుతుందన్న మంత్రి మల్లారెడ్డి…


అలియాబాద్ అంతా గులాబీమయం దిశగా అడుగులు వేస్తున్న మంత్రి మల్లారెడ్డి…
అత్యధిక ఓటర్లు కలిగిన అలియాబాద్ గ్రామం పై పెరిగిన ఫోకస్…
అలియాబాద్ గ్రామానికి చెందిన వివిధ పార్టీ నాయకులు, అలియాబాద్ గ్రామ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి తదితరులను బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి మల్లారెడ్డి…
రాష్ట్ర అభివృద్ధిని చూసి గ్రామ అభివృద్ధి కొరకే టిఆర్ఎస్ పార్టీలో చేరనన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అలియాబాద్ గ్రామ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి..


మేడ్చల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తుండడం కెసిఆర్ ప్రభుత్వ విజయానికి సంకేతమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎన్నికల సమీపిస్తుండడంతో, ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మంత్రి మల్లారెడ్డి అధిక సమయం ప్రజలతోనే గడుపుతున్నారు. అందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీలో చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం అలియాబాద్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అలియాబాద్ గ్రామ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, అలియాబాద్ గ్రామం మరింత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలియాబాద్ గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీలో చేరడంతో, అలియాబాద్ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డిని గజమాలతో సత్కరించారు. మంత్రి మల్లారెడ్డి ముందుగా అలియాబాద్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు అలియాబాద్ గ్రామ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, నర్సింహా, దేవేందర్, రాజేష్, అనిల్ కుమార్, బిక్షపతి, విష్ణు, రామస్వామితోపాటుగా భారీ ఎత్తున్న మహిళాలు, యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అలియాబాద్ గ్రామ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు రైతులకు, అటు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, విజయవంతంగా కొనసాగిస్తుండటం, అంతేకాకుండా మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటం, అనునిత్యం అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటుండటంతో, తమ అలియాబాద్ గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ తాము బిఆర్ఎస్ పార్టీలో చేరిన్నట్లుగా వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధిని కాంక్షిస్తూ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వ ప్రవేశపెట్టి, విజయవంతంగా కొనసాగిస్తోందని గ్రామ సర్పంచ్ గుర్క్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయ్, జడ్పీటీసీ అనిత, మండల రైతు బందు అధ్యక్షులు
కమటం కృష్ణ రెడ్డి,స్థానిక ఎంపీటీసీలు, వార్డు సభ్యులు లింగంతోపాటుగా, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *