తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రవీంద్ర భారతి లో నిర్వహించిన మే డే ఉత్సవాలలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్మికులకు యజమానులకు కార్మిక సంఘాల నాయకులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మికులకు శ్రమశక్తి అవార్డులను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి, ముక్యంగా మంత్రులు సాంస్కృతిక కళాకారులతో కలిసి డప్పు వాయిస్తూ చిందేయడంతో కార్మికుల్లో మరింత జోష్ నిప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదుని, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ MD దాన కిషోర్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కార్మిక సంఘాల నాయకులు వివిధ సంస్థల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.