హైదరాబాద్ : బీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ నేతల్లో అయోమయం పెరిగిపోతున్నట్లుంది. కాంగ్రెస్ పార్టీకి కేసీయార్ ప్రత్యర్ధా ? శతృవు లేకపోతే మితృడా అనే విషయాన్ని తెలంగాణా హస్తం పార్టీ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ఈ అయోమయం నుండి బయటపడలేకే మూడురోజులుగా కేసీయార్ ను టార్గెట్ చేయటం తగ్గించేశారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయటాన్ని కేసీయార్ తప్పుపట్టడమే. రాహుల్ అంశంపై ఢల్లీిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొనటమే కాకుండా రాహుల్ కు సంఫీుభావంగా జరిగిన మార్చ్ ఫాస్ట్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. అలాగే రాహుల్ కు మద్దతుగా కేసీఆర్… నరేంద్రమోడీ బీజేపీ పై విరుచుకుపడుతున్నారు. ఒకవైపు కేసీయార్ తమ అగ్రనేత రాహుల్ కు మద్దతుగా మాట్లాడుతుంటే తెలంగాణాలో తాము కేసీయార్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంభించాలో కాంగ్రెస్ నేతలకు అర్థం కావటం లేదు. ఒకపుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు చాలామంది ప్రతిరోజు కేసీయార్ ను టార్గెట్ చేస్తుండేవాళ్ళు. అలాంటిది ఎప్పుడైతే రాహుల్ కు కేసీయార్ మద్దతు పలికారో అప్పటినుండి తెలంగాణా కాంగ్రెస్ లో సీన్ మారిపోయింది. వారం రోజులుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నరేంద్రమోడీపై ఆరోపణలు విమర్శలతో రెచ్చిపోతున్నారు కాంగ్రెస్ నేతలు. మామూలుగా అయితే ఇటు నరేంద్ర మోడీతో పాటు అటు కేసీయార్ ను కూడా కలిపి రేవంత్ అండ్ కో వాయించేస్తుండేది. అలాంటిది ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా అదంతా కేవలం నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే జరుగుతోంది. ఆరోపణలు విమర్శలను మోడీకి మాత్రమే పరిమితం చేస్తున్నారు. మరి కేసీయార్ ను ఎందుకు వదిలిపెడుతున్నారంటే కాంగ్రెస్ నేతలు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. మొత్తానికి ఇపుడు జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ కు ప్లస్సవుతాయా లేకపోతే మైనస్సవుతాయా కూడా ఎవరు ఊహించలేకపోతున్నారు. ఎన్నికలేమో మరో తొమ్మిది నెలల్లో ఉన్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ లో ఇలాంటి కన్ఫ్యూజన్ ఏమాత్రం మంచిది కాదని అందరికీ తెలిసిందే. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.