
వేసవి ఎండల తీవ్రతకు మనిషి దాహం వేసినప్పుడు సరాసరి వెళ్ళేది మంచినీటి ఉండవద్దకే… అందుకే మట్టి మట్టికుండను పేదవాని ప్రిజ్ అంటారు. అయితే నేటి ఆధునిక సమాజంలో మట్టికుండ కనుమరుగైపోతుంది. దీంతో ఈ వృత్తిపై ఆధారపడిన శాలివాహనుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యారు.వేసవి వచ్చిందంటే మట్టి కుండలకు చాలా గిరాకీ ఉండేది. దీంతో శాలివాహనులు కుండలు తయారుచేసి ఆర్థికంగా కొంత బలపడేవారు. వేసవిలో సంపాదించుకున్న డబ్బులు ఏడాది పాటు వాడుకుంటూ వర్షాకాలం, చలికాలంలలో కూలీ నాలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. గతంలో పేద మధ్యతరగతి ప్రజలతో పాటు ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా మట్టి పాత్రలపై మక్కువ చూపేవారు. అయితే మార్కెట్లోకి ప్లాస్టిక్ వస్తువులు, వాటర్ క్యాన్లు, ప్రిజ్ లు విరివిగా రావడంతో మట్టి కుండలు వాడకం కాలక్రమేనా తగ్గిపోతుంది. దీంతో మట్టి కుండలు కొనే నాధుడే కరువయ్యారు. మట్టి కుండలకు గిరాకీ ఉండే వేసవిలో కూడా అంతంతమాత్రంగా కుండలు కొనుగోలు ఉండడంతో ఈ వృత్తిపై ఆధారపడిన ఎన్నో శాలివాహనుల జీవితాలు ఆగమ్యాగోచరంగా మారాయి. ప్రభుత్వం ఈ వృత్తిదారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో కష్టంతో కూడుకున్న మట్టి పని కావడంతో 50 సంవత్సరాలు పైబడిన శాలివాహనులలో జవసత్వాలు పడిపోయి, మరోపక్క కుండలకు గిరాకీ లేక, ఏ పని చేయలేక ఇబ్బందులు పడుతున్నామని శాలివాహనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ వృత్తిపై ఆధారపడి 50 సంవత్సరాలు పైబడిన శాలివాహనులకు చేనేత కార్మికులకు చేనేత పింఛన్ మాదిరిగా తమకు పింఛన్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు