English News Headline
Allahabad High Court Rules Daughter-in-law Not Liable to Maintain In-laws

Full Telugu News Article
ఉత్తరప్రదేశ్‌లో కుమారుడి మరణం అనంతరం కోడలు భరణం ఇవ్వాలని అత్తమామలు దాఖలు చేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భారతీయ కుటుంబ వ్యవస్థలో అత్తమామల పోషణ కోడలిపై సామాజిక బాధ్యతగా కనిపించినప్పటికీ, చట్టపరంగా అలాంటి బాధ్యత లేదని కోర్టు స్పష్టం చేసింది.
పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసిన వ్యక్తి 2016లో వివాహం చేసుకున్నాడు. 2021లో జరిగిన ప్రమాదంలో అతను మరణించాడు. అనంతరం అతని భార్య ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను పొందింది. ఈ నేపథ్యంలో తమ పోషణ బాధ్యతను కోడలిపై మోపాలని వృద్ధ తల్లిదండ్రులు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
కుమారుడిపై ఆధారపడి జీవించేవారమని, అతని మరణంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాదించారు. అయితే ఫ్యామిలీ కోర్టు వారి వినతిని తిరస్కరించింది. కోడలిపై అత్తమామలను పోషించే చట్టబద్ధ బాధ్యత లేదని స్పష్టం చేసింది.
దీనిపై వృద్ధ దంపతులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయమూర్తి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 144 (మునుపటి సీఆర్పీసీ సెక్షన్ 125) పరిధిని విశ్లేషించారు. ఈ చట్టం ప్రకారం భరణం బాధ్యత భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు మాత్రమే వర్తిస్తుందని, అత్తమామలను ఇందులో చేర్చలేదని కోర్టు తెలిపింది.
అందువల్ల కోడలిపై అత్తమామల పోషణ బాధ్యతను విధించడం చట్ట ఉద్దేశానికి విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు భవిష్యత్‌లో ఇలాంటి కేసులకు మార్గదర్శకంగా నిలవనుంది.
Full English News Article
In a significant ruling, the Allahabad High Court has clarified that a daughter-in-law is not legally obligated to provide maintenance to her in-laws, even if she has received financial benefits after her husband’s death.
The case pertains to Uttar Pradesh, where a police constable who got married in 2016 died in an accident in 2021. Following his death, his wife, who is also a government employee, received the financial benefits related to his service. The deceased constable’s parents approached the family court seeking maintenance from their daughter-in-law.
They argued that they were dependent on their son for livelihood and became financially vulnerable after his death. However, the family court dismissed their plea, stating that there is no legal obligation on a daughter-in-law to maintain her in-laws.
Challenging this, the elderly couple filed an appeal in the Allahabad High Court. While hearing the case, the court examined the scope of Section 144 of the Bharatiya Nagarik Suraksha Sanhita (BNSS), which replaced Section 125 of the CrPC.
The court observed that the law mandates maintenance obligations only towards wife, children, and parents. It does not include in-laws within its ambit. Therefore, imposing such a responsibility on a daughter-in-law would go beyond the legislative intent.
The High Court upheld the earlier decision, reinforcing that no legal duty exists for a daughter-in-law to maintain her in-laws under current law