ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను బయటకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదాయ వనరుల సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పరిశుభ్రమైన నగరాభివృద్ధి లక్ష్యంగా క్యాబినెట్ సబ్‌కమిటీ కీలక సూచనలు చేసింది.

Industries causing pollution within the Outer Ring Road (ORR) are set to be relocated, as decided in the Cabinet

ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను బయటకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదాయ వనరుల సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పరిశుభ్రమైన నగరాభివృద్ధి లక్ష్యంగా క్యాబినెట్ సబ్‌కమిటీ కీలక సూచనలు చేసింది.

Industries causing pollution within the Outer Ring Road (ORR) are set to be relocated, as decided in the Cabinet Sub-Committee review meeting on revenue generation held at the Dr B.R. Ambedkar Telangana Secretariat.

హైదరాబాద్:
రాష్ట్ర ఆదాయ వనరుల సమీక్షలో భాగంగా క్యాబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షత వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావుతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను వెలుపలికి తరలించేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఇందుకోసం స్పష్టమైన విధివిధానాలు, కాలపట్టిక రూపొందించాలని సూచించారు.

అలాగే, హౌసింగ్ బోర్డు ఇళ్ల విక్రయాలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా పథకం రూపొందించాలని అన్నారు. కమర్షియల్ టాక్స్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, గనుల శాఖల ఆదాయాల్లో నెలకొన్న వృద్ధిపై సమీక్షించారు. అందులో పన్నుల వసూళ్లకు సంబంధించిన వివరాలు, శాఖల నుంచి వచ్చే ఆదాయ వనరులను మరింతగా విస్తరించే దిశగా చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *