హైదరాబాద్ ముబై మ్యాచ్ కి 200 అక్రమ నకిలీ టిక్కెట్స్ సృష్టించి క్రికెట్ అభిమానులకు విక్రహించి సొమ్ము చేసుకుంటున్న ముఠాపై నిఘా పెట్టి పసికట్టిన పోలీసులు, నిందుతులను అదుపులోకి తీసుకొని, వీరి నుండి నకిలీ ఐపీఎల్ టిక్కెట్స్ 68, మూడు ఐపీఎల్ అక్రెడిటేషన్ కార్డులు, మూడు సెల్ ఫోన్లు, ఒక సీపీయు, హార్డ్ డిస్క్, మానిటర్ నీ స్వాధీనం చేసుకొని, దర్యాప్తు అనంతరం రిమాండ్ కి తరలించారు. ఏపోని ఈవెంట్స్ అండ్ ఎంట్టైన్మెంట్ వెండర్ ఏజెన్సీలో సబ్ కాంట్రాక్టర్ కోమట్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి పనిచేస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ లకు అఖిల్ అహ్మద్, పెగ్గిది మృదుల్ వంశీ ,మహమ్మద్ ఫాహీం ,శ్రావణ్ కుమార్, మహమ్మద్ అజార్ లను వ్యాలిడేటర్లు నియమించుకున్నాడు. వీరికి జారీ చేసిన అక్రెడిటేషన్ కార్డ్ ల లోని బార్ కోడ్ నీ కాపీ చేసి నకిలీ టిక్కెట్లను తయారు చేసి అమ్ముతున్న కేటు గాళ్లు.