ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో పోలీసుల స్పెషల్ డ్రైవ్… గంజాయి రవాణాపై ఈగల్ టీం కఠిన చర్యలు..

A large-scale police special drive at Eluru’s main railway station led by the Eagle Team aimed to curb illegal ganja transportation. IG Ravi Krishna revealed major seizures and outlined state efforts to eradicate drug cultivation and trafficking.

ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో పోలీసుల స్పెషల్ డ్రైవ్… గంజాయి రవాణాపై ఈగల్ టీం కఠిన చర్యలు
A large-scale police special drive at Eluru’s main railway station led by the Eagle Team aimed to curb illegal ganja transportation. IG Ravi Krishna revealed major seizures and outlined state efforts to eradicate drug cultivation and trafficking.

ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో గురువారం ఉదయం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఎస్పీ నాగేశ్వరరావు, అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రావణ్ కుమార్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ‘ఆపరేషన్ విజయ’ పేరుతో మాదకద్రవ్యాల రవాణాపై ఈ తనిఖీలు కొనసాగించబడ్డాయి.

ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈగల్ టీం ఇప్పటి వరకు 21,736 కేజీల గంజాయిని స్వాధీనం చేసిందని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో డ్రోన్ల సాయంతో సాగుచేసే గంజాయి పంటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నామన్నారు. గంజాయి సాగు నేరమని గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించామని, అనుమతులు కలిగిన 359 మందిపై నిఘా ఉంచామని తెలిపారు.

గంజాయి అక్రమ రవాణాను నిర్మూలించేందుకు రైళ్లలో తనిఖీలు కొనసాగిస్తున్నామని, ఒడిశా నుంచి గంజాయి తరలింపు కేసులు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్‌కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇప్పటికే కేసులు నమోదు చేసి కొందరిపై ఎన్‌డిపీఎస్ యాక్ట్ ప్రకారం ఆస్తులు కూడా జప్తు చేశామని వెల్లడించారు.

జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా మొత్తాన్ని మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 700 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 45 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. విద్యార్థులకు గంజాయి సరఫరా చేసే వ్యక్తులపై తల్లిదండ్రులు సమాచారమిస్తే గోప్యత కల్పిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *