న్యూఢల్లీి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీత డిమాండ్ చేశారు. లోక్‌సభలో రూల్ 377 కింద ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. పార్లమెంట్‌లో ఇచ్చిన విభజన హామీలను నిలబెట్టుకోవాలని గుర్తుచేశారు. ఏపీలో గ్యాస్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు మద్దతివ్వాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని ఎంపీ తెలిపారు. విభజన జరిగి ఏళ్లు గడిచినా మెజార్టీ హామీలు కేంద్రం నిలబెట్టుకోలేదని విమర్శిం చారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏపీ సమస్యలను పరిష్కరించాలని వంగా గీత డిమాండ్ చేశారు.