ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్–2కు దామోదర్ రెడ్డి పేరు — నల్గొండకు గోదావరి నీటిని తెచ్చిన నాయకుడికి సీఎం నివాళి..CM Revanth Reddy

Image: Screenshot from ‘ :   https://x.com/TelanganaCMO : ” (used under fair use for reporting)

ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్–2కు దామోదర్ రెడ్డి పేరు — నల్గొండకు గోదావరి నీటిని తెచ్చిన నాయకుడికి సీఎం నివాళి
CM Revanth Reddy announces SRSP Stage–2 to be named after late leader Ramreddy Damodar Reddy in recognition of his service to Telangana

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ తుంగతుర్తిలో జరిగిన సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ప్రకటన చేశారు. దివంగత నేత సేవలకు గుర్తింపుగా ఎస్‌ఆర్‌ఎస్‌పీ (శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్) స్టేజ్–2కు ఆయన పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు.

Chief Minister Revanth Reddy announced that the SRSP Stage–2 project will be renamed as Ramreddy Damodar Reddy SRSP–2, honouring the late leader’s immense contribution to Telangana’s irrigation development. Speaking at the memorial meeting held in Thungathurthi, the CM recalled Damodar Reddy’s selfless service to the people.

“రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతిచెందడం అత్యంత బాధాకరం. పార్టీ కోసం, కార్యకర్తల కోసం తన ఆస్తులను అర్పించిన నిస్వార్థ నాయకుడు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారు,” అని సీఎం అన్నారు.

Revanth Reddy described Damodar Reddy as a leader who sacrificed his own wealth for public welfare, serving five terms as an MLA and also as a minister.

“నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారంగా గోదావరి జలాలను తరలించేందుకు అలుపెరగని పోరాటం చేశారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు స్టేజ్–2 ప్రారంభానికి ఆయన తీసుకున్న చొరవ వల్లే నల్గొండ ప్రజలకు గోదావరి జలాలు చేరే మార్గం సుగమమైంది,” అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

The Chief Minister added that Damodar Reddy relentlessly fought to bring Godavari water to fluoride-affected areas of Nalgonda through the SRSP Stage–2 project. “Naming SRSP Stage–2 after Damodar Reddy is a true tribute to his legacy,” Revanth stated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *