ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తోటి స్నేహితులతో పదేళ్లపాటు కలిసి విద్య అభ్యసించిన మధుర క్షణాలకు వేదికైన పూర్వ విద్యార్థుల సమ్మేళనం

గరుడ వార్త శామిర్ పేట :  ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తోటి స్నేహితులతో పదేళ్లపాటు కలిసి విద్య అభ్యసించిన మధుర క్షణాలు, వారి గురువుల సాక్షిగా వారందరిలో మెదలడానికి పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేదికయింది. శామీర్పేట మండల పరిధిలోని అలియాబాద్ గ్రామంలోనున్న   అలియాబాద్ జడ్పీహెచ్ఎస్ పదవ తరగతి 2000-2001వ విద్యా సంవత్సరం  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అలియాబాద్ లో నున్న మర్రి ఫామ్స్ ఆదివారం వేదిక అయింది. ముందుగా పూర్వ విద్యార్థులకు విద్యా బోధన చేసిన గురువులచే జ్యోతి ప్రజ్వలన చేయించి, అనంతరం వారికి ఆత్మీయ సన్మానం చేసి వారి గురుభక్తిని మరోసారి చాటుకున్నారు. సదరు విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసి రెండు దశాబ్దాలు దాటినప్పటికీ వారి పదేళ్ల విద్యాభ్యాస ప్రయాణంలోని మధుర స్మృతులను గురువులతో కలిసి నెమర వేసుకున్నారు. అనంతరం విద్యార్థులందరూ వారి ప్రస్తుత స్థితిగతులను పూర్వ విద్యార్థుల అందరితో కలిసి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డితో పాటుగా ఉపాధ్యాయులు దామోదర్, వెంకటస్వామి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, శ్యామల, వెంకట్ రెడ్డితోపాటుగా 2000-2021వ విద్యా సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థులైన తాళ్ల జగదీష్, బొమ్మెర్ల శ్రీకాంత్, మసున నవీన్, పడిగే జ్ఞానేశ్వర్, శివాజీ, రమేష్, గణేష్, చాంద్ పాషా, కుమార్, వెంకటేష్, సందీప్, నాగరాజు, శివ, శ్రీలత, కల్పన, సంధ్య, భార్గవి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *