సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ పరుగులు పెడుతుండటంతో ఐటీ ఉద్యోగులకు తిప్పలు తప్పాయి. ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఈ ఎంఎంటీఎస్ రైలును లాంఛనంగా ప్రారంభించిన విష్యం తెలిసిందే. ఇప్పటికే ఈ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ అధికారులు బుకింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.బొల్లారం రైల్వేస్టేషన్‌ను) ఆధునీకరించారు. సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ రైలు లాలాగూడగేట్, మల్కాజిగిరి, దయానంద్‌నగర్, సఫిల్‌గూడ, రామకృష్ణాపురం, అమ్ముగూడ, కెవలరీ బ్యారక్స్, అల్వాల్, బొల్లారం బజార్, గుండ్లపోచంపల్లి గౌడవెల్లి స్టేషన్లవిూదుగా మేడ్చల్ చేరుకోనుంది. ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ప్రయాణం సులభం కానుంది.ఇప్పటి వరకు మల్కాజిగిరి, దయానంద్‌నగర్, సఫిల్‌గూడ, రామకృష్టాపురం ప్రాంతాల ఐటీ ఉద్యోగులు మెట్టుగూడ వెళ్ళి మెట్రో రైలు ద్వారా హైటెక్‌సిటీ లేదా గచ్చిబౌలి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆయా ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు, అక్కడి నుంచి ఎంఎంటీఎస్‌లో హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. సొంత వాహనంలో అంత దూరం ట్రాఫిక్‌లో ప్రయాణించలేని వారికి ఇది ఉపయుక్తం కానుంది. బొల్లారం నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ 15 నిమిషాలకో సారి ఎంఎంటీఎస్ అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.