New Bus Service Ushar Palli to Secunderabad

ఉషార్‌పల్లి నుంచి సికింద్రాబాద్‌కు కొత్త బస్సు సర్వీస్ ప్రారంభించగా, ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. A new bus service from Ushar Palli to Secunderabad has been launched, improving transport connectivity for commuters.
హకీంపేట్ బస్ డిపో ఆధ్వర్యంలో ఉషార్‌పల్లి నుంచి సికింద్రాబాద్‌కు నూతనంగా బస్సు సర్వీస్ నెంబర్ 120ను ప్రారంభించారు. ఈ సర్వీస్‌ను జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశ్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కొత్త బస్సు సర్వీస్ ప్రారంభంతో ఉషార్‌పల్లి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉద్యోగ, విద్య, వైద్య అవసరాల కోసం సికింద్రాబాద్‌కు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దోసకాయల లత వెంకటేశ్, పెద్దిరెడ్డి శ్రీలత వెంకట్ రెడ్డి, రాజిగళ్ళ లత భూపాల్, మెరుపాటి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి నేమురి విష్ణు గౌడ్, నాయకులు నల్ల ప్రభాకర్ రెడ్డి, తుంకి వెంకటేశం, పెద్దిరెడ్డి వెంకటరెడ్డి, కొండల్ రెడ్డి, నాగిరెడ్డి పెంటారెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
A new bus service number 120 has been introduced from Ushar Palli to Secunderabad under the Hakimpet Bus Depot. The service was inaugurated by District RTA member Bhimidi Jaipal Reddy along with Munchintalapalli Municipal Congress President Dosakayala Venkatesh and local councillors.
Speaking on the occasion, Jaipal Reddy said the new service will help residents of Ushar Palli and nearby areas commute easily to Secunderabad for jobs, education, and medical needs. He emphasized the importance of improving transport facilities in rural areas.
Several councillors and leaders including Dosakayala Latha Venkatesh, Peddireddy Srilatha Venkat Reddy, Rajigalla Latha Bhupal, Merupati Govardhan Reddy, Nemuri Vishnu Goud and others participated in the programme.