ఉమ్మడి రాష్ట్రంలో 3 డయాలసిస్ కేంద్రాలు ఉండేవి, వాటిని 102కు పెంచిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది… మంత్రి హరీష్ రావు

నాంపల్లి ఏరియా ఆసుపత్రి లో డయాలసిస్ కేంద్రం,బ్లడ్ బ్యాంక్ ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు..


ఉమ్మడి రాష్ట్రంలో 3 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరవాత 102 కు పెంచుకున్నాం. గత ప్రభుత్వాల పాలనలో గాంధీ,ఉస్మానియా,నిమ్స్ తప్ప మరో పెద్ద ఆసుపత్రి లేదు.
ఇప్పుడు నగరం నలుమూలల టీమ్స్ ఆసుపత్రులు,వరంగల్ లో హెల్త్ సిటీ నిర్మాణం చేసుకుంటున్నాం.
వైద్యుల సంఖ్యను పెంచుతున్నాం. గతం లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం డెలివరిలు అయ్యేవి..ఇప్పుడు 64 శాతానికి పెరిగింది. డెలివరీ మహిళల కోసం,రేపటి తరం ఆరోగ్యం కోసం మరో రెండు వారాల్లో 250 కోట్ల నిధులతో కెసిఆర్ న్యూట్రీషియన్ కిట్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాము. ఈ కిట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆరున్నర లక్షల మంది గర్భిణీలు లబ్దిపొందనున్నరని మంత్రి హరీష్ రావు అన్నారు.

సీఎం కెసిఆర్ గారు ఈ సమస్యను మానవతా హృదయంతో ఆలోచించి పరిష్కారం చూపించారు.ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్ చేయాలని ఆదేశించారు. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వంలో 3 నుంచి 102కు పెంచాముని మంత్రి హరీష్ రావు అన్నారు.

రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్‌ చేయించుకుంటున్నారు, వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్‌ చేయిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *