ఉద్యమకారులు అసంతృప్తిగా ఉన్నది వాస్తవమే: అయితే అందరికి తప్పక అవకాశం వస్తుంది… మంత్రి తలసాని..



తమకు ప్రాధాన్యం ఉండడం లేదని ఉద్యమకారులు అసంతృప్తిగా ఉన్నది వాస్తవమేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌అన్నారు. ఎవరూ తొందరపడవద్దని, అందరికీ అవకాశం వస్తుందని చెప్పారు. కంటోన్మెంట్‌ ఒకటవ వార్డుకు సంబంధించిన బీఆర్‌ఎస్పార్టీ ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్‌లో జరిగింది. కంటోన్మెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజుల శ్రావణ్‌, తెలంగాణ బేవరేజెస్‌ చైర్మన్‌ గజ్జెల నగేష్‌, తెలంగాణ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌ పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా దివంగత ఎమ్మెల్యే సాయన్న చిత్రపటానికి తలసాని, మర్రి రాజశేఖర్‌రెడ్డి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కంటోన్మెంట్‌ నియోజకవర్గంనాయకులంతా ఒకతాటిపైకి వచ్చి రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతానికి చేసింది ఏవిూలేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంలో కేసీఆర్‌, మోదీ మధ్య వ్యత్యాసాన్ని మన్నె క్రిశాంక్‌ ప్లకార్డుల ద్వారా ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *