
ఉత్తరకొరియాలో వారసత్వ రాజకీయాలపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. Reports suggest Kim Jong Un may be preparing his daughter as successor, sparking debate about future leadership in North Korea.
ఉత్తరకొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 13 ఏళ్ల కిమ్ జుయే ఇటీవల కీలక కార్యక్రమాల్లో తండ్రితో కలిసి కనిపించడం వల్ల ఈ అంచనాలు బలపడ్డాయి. అణు పరీక్షలు, మిలిటరీ పరేడ్‌లు వంటి కార్యక్రమాల్లో ఆమె హాజరు కావడం, విదేశీ పర్యటనల్లో కూడా పాల్గొనడం రాజకీయ వారసత్వ సంకేతంగా భావిస్తున్నారు.
Speculation is growing that North Korean leader Kim Jong Un may designate his daughter Kim Ju Ae as his political successor. The 13-year-old has appeared alongside him at military parades, weapons tests and official events, leading analysts to view her as a possible future leader.
ఈ నిర్ణయం అమలైతే దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ పాత్రపై దృష్టి పడింది. దేశంలో రెండో అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా భావించే ఆమెకు పార్టీ, సైన్యంలో మంచి పట్టు ఉందని అంచనా. వారసత్వ నిర్ణయం తీసుకుంటే అంతర్గత పోటీ పెరగవచ్చని చర్చ జరుగుతోంది.
Analysts say such a move could reshape North Korea’s political landscape. Attention has also turned to Kim’s sister Kim Yo Jong, considered one of the most powerful figures in the regime. With strong influence in the party and military, her role may become crucial if succession plans move forward.
కిమ్ కుటుంబ పాలనలో గతంలో కూడా అధికార పోటీలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు బయటకు రాకపోయినా, నాయకత్వ మార్పుల సమయంలో అంతర్గత ఉద్రిక్తతలు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉత్తరకొరియా రాజకీయ వ్యవస్థ అత్యంత గోప్యంగా ఉండటంతో అధికారిక సమాచారం వెలువడే వరకు స్పష్టత ఉండదు.
North Korea’s leadership history shows that succession has often been tightly controlled. Experts note that internal tensions may rise during leadership transitions, but the country’s secrecy makes confirmation difficult until official announcements.
ఫిబ్రవరి చివరలో జరగనున్న వర్కర్స్ పార్టీ సమావేశంపై ప్రపంచం దృష్టి సారించింది. ఆ సమావేశంలో వారసత్వంపై కీలక సంకేతాలు వెలువడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Global attention is now on the upcoming Workers’ Party meeting, where potential signals about North Korea’s future leadership may emerge.