
ఈనెల 22న పాడేరు ఐటిడిఏలో జి.ఓ నెం.3పై వర్కుషాపు నిర్వహణ
Workshop on G.O. No. 3 Scheduled at Paderu ITDA on July 22
గిరిజన చట్టాలపై అవగాహన కల్పించేందుకు జూలై 22న పాడేరు ఐటిడిఏ కార్యాలయంలో జి.ఓ నెం.3పై వర్కుషాపు నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాలు, ట్రేడ్ యూనియన్లు తదితరులు పాల్గొనాలని అధికారులు తెలిపారు.
To raise awareness on tribal laws, a one-day workshop on G.O. No. 3 will be conducted at the ITDA office in Paderu on July 22. Public representatives, tribal unions, and other stakeholders are invited to participate.
పాడేరు, జూలై 19:
విజయవాడ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు ఈనెల 22న ఉదయం 10 గంటలకు జి.ఓ నెం. 3పై ఒక రోజు వర్కుషాపు నిర్వహించనున్నట్లు ఐటిడిఏ ఇంచార్జి ప్రాజెక్టు అధికారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్కుషాపును గిరిజన సంక్షేమ సంచాలకురాలు సదా భార్గవి అధ్యక్షతన ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహిస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాడేరు ఐటిడిఏ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నేతలు, ఆదివాసీ గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు, జాయింట్ యాక్షన్ కమిటీలు, సాధన కమిటీలు, గిరిజన విలేఖరుల సంఘాలు, లాయర్ల యూనియన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, గిరిజన పెద్దలు తదితరులు పాల్గొనాలని పి.ఓ. కోరారు. జి.ఓ నెం.3 మరియు ఏజెన్సీ చట్టాలపై వారు తమ అభిప్రాయాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.