ఇరాన్ నుంచి డ్రోన్లు, మిస్సైళ్లు దూసుకొచ్చి అజర్‌బైజాన్‌లోని నక్చీఖాన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిలో విమానాశ్రయం పాక్షికంగా దెబ్బతిని ఇద్దరు పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Drones and missiles from Iran targeted Azerbaijan’s Nakhchivan International Airport, partially damaging the facility and injuring two civilians, according to officials.

ఇరాన్ నుంచి డ్రోన్లు, మిస్సైళ్లు దూసుకొచ్చి అజర్‌బైజాన్‌లోని నక్చీఖాన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిలో విమానాశ్రయం పాక్షికంగా దెబ్బతిని ఇద్దరు పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Drones and missiles from Iran targeted Azerbaijan’s Nakhchivan International Airport, partially damaging the facility and injuring two civilians, according to officials.

ఇరాన్ మరోసారి ప్రతీకార దాడులను కొనసాగించింది. తాజా ఘటనలో అజర్‌బైజాన్‌పై డ్రోన్లతో దాడి జరిగింది. ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న నక్చీఖాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో విమానాశ్రయ టెర్మినల్ భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు అజర్‌బైజాన్ అధికారులు వెల్లడించారు.

Iran has continued its retaliatory strikes in the region. In the latest incident, a drone attack targeted Azerbaijan. The Nakhchivan International Airport, located near the Iranian border, was reportedly hit by drones, causing partial damage to the terminal building.

అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇరాన్ వైపు నుంచి మిస్సైళ్లు దూసుకొస్తున్నాయని స్థానిక రాడార్ వ్యవస్థలు గుర్తించాయి. వాటిలో ఒక డ్రోన్ నక్చీఖాన్ విమానాశ్రయ టెర్మినల్ భవనంపై పడగా, మరో డ్రోన్ షెకెరాబాద్ గ్రామంలోని ఒక పాఠశాల భవనం సమీపంలో కూలిపోయినట్లు పేర్కొంది.

According to Azerbaijan’s Foreign Ministry, radar systems detected missiles and drones approaching from the Iranian side. One drone struck the terminal building of Nakhchivan Airport, while another crashed near a school building in Shekerabad village.

ఈ ఘటనలో విమానాశ్రయానికి పాక్షిక నష్టం వాటిల్లింది. ఇద్దరు పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిని అజర్‌బైజాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

Authorities confirmed that the airport sustained partial damage and two civilians were injured in the attack. Azerbaijan strongly condemned the strike.

ఇటీవలి కాలంలో అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో పలు దాడులు చేస్తోంది. డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లతో వరుసగా లక్ష్యాలను దాడి చేస్తూ ఉద్రిక్తతను పెంచుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

In recent weeks, Iran has launched several attacks across the Gulf region in response to actions by the United States and Israel. The use of drones and ballistic missiles has heightened tensions and raised concerns about regional security.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *