Amid escalating tensions between Iran and Israel, a Telangana native was seriously injured in a missile attack in the Gulf region

ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ ప్రాంతంలో జరిగిన మిస్సైల్ దాడిలో తెలంగాణకు చెందిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. యూఏఈ విమానాశ్రయంపై దాడి సమయంలో అద్దాలు పగిలి గాజు ముక్కలు తగలడంతో అతడికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Amid escalating tensions between Iran and Israel, a Telangana native was seriously injured in a missile attack in the Gulf region. During the strike on a UAE airport, shattered glass pieces hit him, leaving him injured and causing concern among his family members.
మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందోననే ఆందోళనతో జీవిస్తున్నారు.
Tensions in the Middle East have intensified due to the conflict involving the United States, Israel, and Iran. Retaliatory attacks by Iran have created panic among residents in Gulf countries, who are living under constant fear of further strikes.
ఇరాన్ మిస్సైల్ దాడిలో తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అబుదాబి విమానాశ్రయంపై జరిగిన దాడిలో సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రాజేశ్వరరావు గాయపడ్డాడు. కొంతకాలంగా అతడు దుబాయ్ విమానాశ్రయంలో క్లీనింగ్ విభాగంలో పని చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
A man from Telangana was injured in the missile attack. Rajeshwar Rao, a native of Pothireddypalli in Yellareddypet mandal of Sircilla district, sustained injuries during the strike on Abu Dhabi airport. According to family members, he had been working in the cleaning department at Dubai airport for some time.
దాడి సమయంలో విమానాశ్రయంలో అద్దాలు పగిలిపోవడంతో గాజు ముక్కలు రాజేశ్వరరావు ఛాతి మరియు కుడి చేతిలో గుచ్చుకున్నాయి. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
During the attack, glass panels at the airport shattered and fragments pierced Rajeshwar Rao’s chest and right hand, causing serious injuries. His family members have expressed deep concern over his health condition.
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ వాసుల కుటుంబాల్లో భయం నెలకొంది. ముఖ్యంగా ఇజ్రాయెల్‌లో పని చేస్తున్న వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఫోన్ మరియు వీడియో కాల్స్ ద్వారా వారి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు.
Amid the escalating Israel–Iran conflict, families of Telangana natives working abroad are increasingly worried. Families of those employed in Israel are especially anxious and are contacting them through phone and video calls to check on their safety.
ఇజ్రాయెల్ ప్రభుత్వం భద్రతా చర్యల్లో భాగంగా బంకర్లను ఏర్పాటు చేసినప్పటికీ, పరిస్థితులు ఎప్పుడు మారుతాయోననే అనిశ్చితి కొనసాగుతోంది. అక్కడ ఉన్న తెలంగాణ వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Although the Israeli government has set up bunkers as part of security measures, uncertainty continues about how the situation may evolve. Telangana residents living there remain on high alert.
ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన అనేక మంది కూడా ఇజ్రాయెల్‌లో ఉపాధి కోసం ఉన్నారు. సుమారు నాలుగు నుండి ఐదు వేల మంది వరకు అక్కడ పని చేస్తున్నట్లు సమాచారం. యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Meanwhile, many people from the Armur constituency in Nizamabad district are also employed in Israel. Reports suggest that around 4,000 to 5,000 individuals from the region work there. As tensions escalate, their families are increasingly worried about their safety.