ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్థాన్ రేంజర్లు అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ హైకోర్ట్ ఆవరణలో ఆయన్ను అరెస్ట్ చేశారు. అల్ కాదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడిరచారు. ఇమ్రాన్ అరెస్ట్ సమయంలో కోర్టులో ఘర్షణ జరిగింది. దీంతో ఇమ్రాన్ లాయర్లకు గాయాలయ్యాయి. ఇమ్రాన్‌కు కూడా గాయాలయ్యాయని పీటీఐ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్‌ను పాక్ రేంజర్లు రహస్యప్రాంతానికి తరలించారు.ఇమ్రాన్ అరెస్ట్‌తో ఇస్లామాబాద్‌తో పాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఇమ్రాన్ మద్దతుదారులు కోర్టు బయట, దేశంలోని పలు పట్టణాల్లో విధ్వంసానికి దిగారు.పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తనపై కుట్ర చేస్తోందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. ఎలాగైనా తనను కేసుల్లో ఇరికించాలని, హత్య చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని అరెస్ట్‌కు ముందు ఇమ్రాన్ వీడియో సందేశం సోషల్ విూడియాలో విడుదల చేశారు.అటు ఇమ్రాన్‌పై 85 కేసులు పెండిరగ్‌లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ రాగా మరికొన్ని కేసుల విచారణ కొనసాగుతోంది.పాకిస్థాన్ ముస్లిం లీగ్
నవాజ్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయడం లేదని ఇమ్రాన్ ఇటీవలే ఆరోపించారు.
మరోవైపు మూడు టెర్రరిజం కేసుల్లో ఇమ్రాన్‌కు లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిలు మంజూరు చేసింది.