Councillor Akula Yadagiri of Ward No.2 in Ibrahimpatnam Municipality was reported missing, with family members alleging abduction and staging a protest.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన 2వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకాకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పాలని భార్య, కుమారుడు మున్సిపల్ కార్యాలయం ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యుల ఆరోపణలతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మిగతా కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం నిర్వహించారు.
Family members alleged that Akula Yadagiri was abducted after he failed to attend the swearing-in ceremony. His wife and son demanded clarity on his whereabouts, expressing concern in front of the municipal office.
Meanwhile, Ibrahimpatnam RDO Ananth Reddy administered the oath to other councillors at the municipal office. Officials have not yet issued a detailed statement regarding the alleged disappearance.
