ఇన్‌హౌస్ కమిటీ నివేదికపై సవాల్‌ చేసిన జస్టిస్ యశ్వంత్ వర్మ – సుప్రీంకోర్టును ఆశ్రయించిన హైకోర్టు న్యాయమూర్తి

Justice Yashwant Varma challenges in-house committee findings in Supreme Court over cash seizure case

ఇన్‌హౌస్ కమిటీ నివేదికపై సవాల్‌ చేసిన జస్టిస్ యశ్వంత్ వర్మ – సుప్రీంకోర్టును ఆశ్రయించిన హైకోర్టు న్యాయమూర్తి

Justice Yashwant Varma challenges in-house committee findings in Supreme Court over cash seizure case

ఢిల్లీలో తన నివాసంలో భారీగా నగదు వెలుగు చూసిన కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇన్‌హౌస్ కమిటీ ఇచ్చిన నివేదిక రాజ్యాంగ ఉల్లంఘనకు సమానం అని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో మార్చి 14న ఆయన ఇంట్లో స్టోర్‌రూమ్‌లో మంటలు చెలరేగిన సమయంలో గుర్తు తెలియని నోట్ల కట్టలు బయటపడ్డాయి.

పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు చెందిన ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఈ విషయంపై మే 4న నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా అప్పటి సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ వర్మను తొలగించాలంటూ రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశారు.

అయితే తనను తొలగించాలన్న సిఫార్సు రాజ్యాంగ వ్యతిరేకమని వర్మ అభిప్రాయపడ్డారు. ఇన్‌హౌస్ దర్యాప్తు సరైన ప్రక్రియలో జరగలేదని, అధికారిక ఫిర్యాదు లేకుండానే విచారణ చేపట్టిన తీరును ఆయన ప్రశ్నించారు. 1968 జడ్జీల రక్షణ చట్టం ప్రకారం విచారణ జరగలేదని, ఆధారాలు లేనిదే తనపై అవాస్తవ ఆరోపణలు చేశారని వర్మ పిటిషన్‌లో పేర్కొన్నారు.

మార్చి 14 రాత్రి 11:35 గంటలకు ఆయన ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది 15 నిమిషాల్లో మంటలు అదుపులోకి తెచ్చారు. ఆ సమయంలో స్టోర్‌రూమ్ నుంచి గుర్తు తెలియని నోట్ల కట్టలు బయటపడటం, వాటికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో విచారణను ఎదుర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *