ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన వైఎస్‌ షర్మిల..

భూహక్కులు, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన ఇంద్రవెల్లి అమరవీరులకు ఈరోజు నివాళి అర్పించడం జరిగిందిని వైస్ షర్మిల అన్నారు. పోలీసు తూటాలకు నెత్తురోడి, మరో జలియన్ వాలా బాగ్ లా మారిన ఈప్రాంతం ఉద్యమ త్యాగాలకు నిదర్శనమని అన్నారు. అమరవీరుల స్ఫూర్తితో గిరిజనుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేసారు.

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల గురువారం నాడు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తరువాత ఆమె విూడియాతో మాట్లాడారు. ఇంద్రవెల్లి గడ్డకు సలాం. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన అమరులకు సలాం. వైఎస్సార్‌ పాదయాత్రలో ఎన్నో సమస్యలు చూశాడు. పాదయాత్రలో పోడు భూముల సమస్య కళ్ళాలా చూశాడు. పోడు భూములకు హక్కులు ఇవ్వకపోతే బ్రతుకే లేదు అని అనుకున్నాడు. సీఎం అయ్యాక వెంటనే కోనేరు రంగారావు కమిటీ వేశాడు. సీఎం గా వైఎస్సార్‌ 3.30లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చాడు. వైఎస్సార్‌ బ్రతికి ఉంటే మిగిలిన 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చేవాడు. వైఎస్సార్‌ మరణాంతరం అప్పుడున్న కాంగ్రెస్‌,తర్వాత కేసీఅర్‌ ఒక్క ఎకరానికి పట్టా ఇవ్వలేదు. వైఎస్సార్‌ ఇచ్చినట్లు ఏ ఒక్క నాయకుడు పట్టా ఇవ్వలేదు. కేసీఅర్‌ ఎన్నికల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తా అని మాట ఇచ్చాడు. పోడు భూముల సమస్య ఉందని తెలుసు అన్నాడు. 6 నెలల్లో పట్టాలు ఇస్తా అని చెప్పాడు. గెలిచిన వెంటనే నేను నా బలగం వచ్చి కుర్చీ వేసుకొని పట్టాలు ఇస్తా అన్నాడు. 9 ఏళ్లుగా కేసీఅర్‌ ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వలేదు. కేసీఅర్‌ ఒక చేతకాని ముఖ్యమంత్రి. కేసీఅర్‌ కి చిత్త శుద్ది లేదని అన్నారు.
వైఎస్సార్‌ ఇచ్చిన మాట విూద ప్రతి హావిూ నిలబెట్టుకున్నారు. వైఎస్సార్‌ బిడ్డ గా మాట ఇస్తున్న. వైఎస్సార్‌ పోడు భూముల విూద హక్కులు కల్పించినట్లు వైఎస్సార్‌ బిడ్డ కూడా మాట ఇస్తుంది. అధికారంలో వచ్చిన 4 నెలల్లో 13 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తా. కేసీఅర్‌ పోడు పట్టాలు ఇస్తా అని ఆదివాసీలను మోసం చేశాడని అన్నారు.


పట్టాలు అడిగినందుకు జైల్లో పెట్టారు. గత 9 ఏళ్లుగా వేలాది గా కేసులు పెట్టారు. గిరిజనులను కేసీఅర్‌ వంచనకు గురి చేశాడు. గిరిజన బందు అని మోసం చేశాడు. ఇంద్రవెల్లి ఘటన ఒక జలియన్‌ వాలా బాగ్‌ ను తలపించింది. తెలంగాణ వస్తే మంచి రోజులు అని చెప్పాడు. ఇప్పుడు పట్టాలు అడిగితే జైల్లో పెడుతున్నారు. ఫారెస్ట్‌ భూముల్లో ట్రెంచ్‌ లు వేస్తున్నారు. కేసీఅర్‌ గిరిజన ద్రోహి అని అన్నారు. 10శాతం రిజర్వేషన్‌ అమలు అని చెప్పి పట్టించుకోలేదు. గిరిజన సంక్షేమం అని చెప్పి చేసిన మోసం అంతా ఇంతా కాదు. రాష్ట్ర బడ్జెట్‌ లో కనీసం ఒక శాతం కూడా నిధులు ఖర్చు చేయడం లేదు. అధికారంలో వచ్చాక ఆదివాసీల అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని మాట ఇస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *