కోరుట్ల : పట్టణంలోని పూలే అంబేడ్కర్ నగరంలో 45 వ రోజులుగా సీపీఎం పార్టీ చేస్తున్న ఇండ్ల పోరాటానికి సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి బుధవారం పూలే అంబేడ్కర్ నగరంలోని ఇండ్ల స్థల సాధన ఉద్యమ శిబిరానికి సందర్శించారు..ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ సిపిఎం పార్టీ 45 రోజులుగా చేస్తున్నఇండ్ల స్థల పోరాటానికి సిపిఐ మద్దతు ఇస్తున్నామని చెప్పారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 58వ జీవో ప్రకారం ఇండ్ల లేని ప్రతి నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల,కేంద్ర ప్రభుత్వం 10 లక్ష రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు, రాజ్యాంగ బద్ధంగా ప్రతి మనిషికి ఇల్లు లేని వారికి ఇల్లా స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు, అధికార దాహంతో భయపెట్టాలని చూస్తున్న నిరుపేదలకు కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇండ్ల స్థలాలు ఇచ్చేదాకా భూ పోరాటం ఆపేది లేదని ఆయన చెప్పారు..ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వెన్నెమ్ సురేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శివనాథ్, సిపిఎం జిల్లా కన్వీనర్ జి తిరుపతి నాయక్, పోరాట కమిటీ సభ్యులు రజియా సుల్తానా,చిలుక ఉమా, మొబీనా బేగం తదితరులు పాల్గొన్నారు.