ఇంజినీరింగ్ బీ-కేటగిరీ సీట్లకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం – షెడ్యూల్ విడుదల చేసిన టీజీసీహెచ్ఈApplications open for Telangana Engineering B-category seats; schedule announced by TGCHE

ఇంజినీరింగ్ బీ-కేటగిరీ సీట్లకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం – షెడ్యూల్ విడుదల చేసిన టీజీసీహెచ్ఈ
Applications open for Telangana Engineering B-category seats; schedule announced by TGCHE

తెలంగాణలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల బీ-కేటగిరీ సీట్ల భర్తీకి రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ షెడ్యూల్ విడుదల చేసింది. జులై 19 నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఆగస్టు 14నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్:
తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీ-కేటగిరీ సీట్ల భర్తీకి రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (TGCHE) షెడ్యూల్ విడుదల చేసింది. జులై 19వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు విద్యార్థులు సంబంధిత కాలేజీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లాసులు ఆగస్టు 14 నుంచి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఇంజినీరింగ్ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయబడతాయి. మిగతా 30 శాతాన్ని బీ-కేటగిరీగా పరిగణిస్తారు. ఈ కేటగిరీలో సుమారు 33,000 సీట్లు అందుబాటులో ఉన్నట్లు అంచనా. గతేడాది ఈ కోటాలో 27,936 సీట్లు భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు.

అడ్మిషన్ ప్రక్రియ AICTE మార్గదర్శకాల మేరకు జరుగుతుంది. EAPCET-2025, JOSAA, CSAB వంటి ఇతర కౌన్సెలింగ్‌లతో సమన్వయం చేస్తూ ఈ ప్రక్రియను అమలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

నిబంధనల ప్రకారం, ప్రతి కాలేజీ కనీసం మూడు వార్తాపత్రికల్లో నోటిఫికేషన్‌ ఇవ్వాలి. అందులో బ్రాంచుల వారీగా మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ సీట్ల లభ్యత, దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు, ట్యూషన్ ఫీజు మరియు సమర్పణ తేదీలను స్పష్టంగా పేర్కొనాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *