హైదరాబాద్ : ఇంటర్నేషనల్ నర్సస్ డే ఉత్సవాలలో భాగంగా ఆరోగ్యశాఖలో వెన్నెముక అయినటువంటి నర్సింగ్ వృత్తిని నర్సింగ్ సేవలను గుర్తించి వివిధ ఆస్పత్రుల లోని నర్సింగ్ అధికారుల నుండి ఎంచుకోబడిన 150 మంది నర్సులకు లేడి విత్ ల్యాంప్ అవార్డు 2023 లను ప్రదానం చేసారు.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున, నారాయణగూడ లోని రెడ్డి ఉమెన్స్ కాలేజీలో రెడ్ క్రాస్ హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యుల్లత బాంధకవి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ తెలంగాణ, కాకమొని శశి శ్రీ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ, డా.విజయ భాస్కర్ గౌడ్ స్టేట్ ఐఆర్సిఎస్ సిపిఆర్ కన్వీనర్, శ్రీరామ్దాస్ తేజ ఏసీబీ ఆఫ్ సెంట్రల్ జోన్ హైదరాబాద్, నేరెళ్ల మాల్యాద్రి విశ్రాంత సుప్రీంకోర్టు జడ్జ్, ఏ పద్మజ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ కోటి, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ విజయ కుమారి, అజ్మీర్ విజయ సత్యనారాయణ గ్రేడ్ వన్ నర్సింగ్ సూపరినీటెన్డెంట్ సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, సుజాత రాథోడ్ గ్రేడ్ వన్ నర్సింగ్ సూపర్నెంట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్,శ్రీ మహేందర్ రెడ్డి, శ్రీ సాయి చౌదరి కార్యక్రమ నిర్వాహకులుగా డాక్టర్ శ్రీదేవి, జ్యోతి యాదవ్, కల్పన దత్త గౌడ్ నర్సింగ్ ఆఫీసర్, వినయ్ కిషోర్ ఎం సి మెంబర్, వీరమని ఎంసి మెంబర్, స్వర్ణ రెడ్డి, డాక్టర్ రవికుమార్ డాక్టర్ హుస్సేన్ ,మజీద్ భాయ్ , మహేందర్ రెడ్డి , వెంకట్ పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చిన్నారి టి.ప్రహర్షిత నాట్యనీ, ఆకట్టుకునీది హంసవేని చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన నృత్యానికి ఆకర్షితులై, ఉచిత వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ విజయభాస్కర్ గౌడ్ హావిూ ఇచ్చారు . అదేవిధంగా రెడ్ క్రాస్ కూడా వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యఅతిథి విద్యుల్లత మాట్లాడుతూ ఇంతమంది నర్సెస్ ని గుర్తించి అవార్డు బహుకరించినందుకుగాను రెడ్ క్రాస్ హైదరాబాదు బ్రాంచ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు .కోవిడ్ సమయంలో గాంధీ హాస్పిటల్ లోని వైద్య సిబ్బంది ని ఎన్నో రకాలుగా ఆదుకున్న గవర్నర్ ని, మన రాష్ట్ర సొసైటీని కొనియాడారు.