శ్రీకాళహస్తి

ఆసనం పై ఆసక్తి
శ్రీకాళహస్తి
ఈనెల 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రమంతటా అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోనూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆర్ పి బి ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పంచాయతీరాజ్ అతిధి భవనం వరకు ఉన్న ప్రహరీ గోడలపై యోగాసనాలు చిత్రాలను గీయించారు. వివిధ ఆసనాలు ఉన్న చిత్రాలను ఈ మార్గంలో వెళ్తున్న పలువురు ప్రయాణికులు, స్థానికులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.