
ఆయిల్ ఫాం లక్ష్య సాధనలో పూర్తి సమన్వయంతో పని చేయాలి – జిల్లాకు Collector హైమావతి ఆదేశాలు
To ensure successful implementation of the oil palm cultivation targets, Siddipet Collector Haimavati conducted a comprehensive review meeting with officials from Agriculture, Horticulture, and Oilfed departments. She stressed on completing farmer registration, ensuring fertilizer shop inspections, and extensive awareness campaigns to motivate small and marginal farmers toward oil palm farming.
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫాం సాగును లక్ష్యంగా పెట్టుకుని జిల్లాకు కేటాయించిన 6500 ఎకరాల టార్గెట్‌ను పూర్తి చేయాలంటూ కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ మాట్లాడుతూ ఇప్పటివరకు 12339 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు జరిగిందని, 2025-26 లో 6500 ఎకరాల లక్ష్యాన్ని చేరేందుకు ఇప్పటివరకు 847 మంది రైతులను గుర్తించి, 3400 ఎకరాల కవర్ చేసినట్టు తెలిపారు. ఇందులో 258 రైతుల నుంచి 1901 ఎకరాల డీడి కలెక్షన్, 61 రైతుల నుంచి 350 ఎకరాలకు మొక్కలు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఇప్పటికే 1850 టన్నుల గెల్లలను ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తరలించినట్టు తెలిపారు.
Collector సూచనలు:
- ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చూడాలి.
- ఆయిల్ ఫాం పంట ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలి.
- పెద్దలతో పాటు చిన్న రైతులను కూడా ఈ పంట వైపు ఆకర్షించాలి.
- రైతు వేదికల్లో, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలి.
- ప్రోగ్రెస్ తక్కువగా ఉన్న క్లస్టర్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
- కలెక్షన్ సెంటర్ల పనితీరును మెరుగుపరచాలి.
సమావేశంలో ఆయిల్‌ఫెడ్ జాయింట్ డైరెక్టర్ సునీత, జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.