అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రప్పారప్పా డైలాగులు, బెదిరింపు మాటలు ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు..In the Assembly

అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రప్పారప్పా డైలాగులు, బెదిరింపు మాటలు ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు. జగన్‌ను నేరుగా ఉద్దేశిస్తూ సభలో హాజరుకాకుండా ప్రశ్నలు వేయడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.

In the Assembly session, Speaker Ayyanna Patrudu strongly reacted to the remarks of YSRCP leaders. He said threatening “rappaarappa” dialogues harm democracy. Addressing Jagan directly, he questioned why opposition leaders skip the House but still send questions.
అసెంబ్లీ సమావేశాల్లో గురువారం శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, వైసీపీ నేతలు ప్రెస్‌మీట్లు, సోషల్ మీడియా ద్వారా బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. “మళ్లీ మేమే వస్తాం, మీ అంతు చూస్తాం, పీకలు కోస్తాం, రప్పారప్పా అంటూ సినిమా డైలాగులు కొడుతున్నారు. ఎన్టీఆర్ హయాంలో నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మేమూ ఓడిపోయాం, కానీ ఇలా మాట్లాడలేద”ని స్పష్టంచేశారు.

అయన అన్నారు: “ప్రజాస్వామ్యంలో గెలుపు–ఓటములు సహజం. ప్రతిపక్షంలో ఉన్నవారు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. సభకు వచ్చి ప్రజల కోసం మాట్లాడాలి. సభకు రాకుండా ప్రశ్నలు వేయడం ఎందుకు? సభకురారు, ఎమ్మెల్యేలను రానివ్వరు, కానీ క్వశ్చన్‌లు మాత్రం పంపుతున్నారు. ప్రజలు దీన్ని ఖండించాలి” అని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అలాగే, గతంలో గౌతు లచ్చన్న వంటి నేతల ఉదాహరణను ప్రస్తావించారు. ఆయన పార్టీ నుంచి 64 మంది గెలిచినప్పటికీ ప్రతిపక్ష హోదా వదులుకున్నారని గుర్తు చేశారు. “ఇప్పుడు నెంబర్ లేకుండా నాకెందుకు ఇవ్వలేదని కోర్టుకు వెళ్తున్నారు. అసెంబ్లీ దేవాలయం, నేను పూజారి. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు నియమావళి ప్రకారం ఉంటాయి” అని స్పీకర్ వ్యాఖ్యానించారు
Speaker Ayyanna Patrudu strongly criticized YSRCP leaders in the AP Assembly, calling their “rappaarappa” style dialogues a threat to democracy and questioning Jagan directly.
In the AP Assembly session on Thursday, during a short discussion on law and order, Speaker Ayyanna Patrudu delivered sharp remarks against the conduct of YSRCP leaders. He said that threatening comments made in press meets and on social media — such as “we will return to power, we will finish you, we will cut throats, rappaarappa dialogues” — were inappropriate and dangerous.

The Speaker observed, “I have been in politics since NTR’s time, but I have never seen such a situation. Even when we lost, we never spoke like this. Winning and losing are part of democracy. Those in opposition must behave more responsibly. They should attend the Assembly and speak for the people. How can they send questions while skipping the House? You don’t come, you don’t allow your MLAs to come, but you send questions. People need to condemn this.”

Directly addressing Jagan, the Speaker questioned his approach and highlighted the absence of accountability from YSRCP members. He also recalled the example of former leader Gouthu Latchanna, who, despite his party winning 64 seats, gave up the status of opposition leader when members left. “Now, without numbers, they ask why status is not given and even go to court. The Assembly is a temple, I am its priest, and decisions here are taken as per rules,” Ayyanna Patrudu clarified.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *