A new Core Urban Act will replace the GHMC Act for three corporations within the ORR limits, aiming to streamline urban governance, sanitation, safety and infrastructure works.

అవుటర్ రింగురోడ్డు పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా కొత్త కోర్ అర్బన్ చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. A new Core Urban Act will replace the GHMC Act for three corporations within the ORR limits, aiming to streamline urban governance, sanitation, safety and infrastructure works.
అవుటర్ రింగురోడ్డు (ORR) పరిధిలోని (#CURE) మూడు కార్పొరేషన్లకు వర్తించేలా ప్రస్తుతం అమలులో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ తదితర వ్యవహారాలన్నింటికీ కొత్త చట్టమే ప్రామాణికంగా ఉండాలని సూచించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక దిశానిర్దేశాలు జారీ చేశారు.
కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో స్పష్టత లేక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుగా చెత్త సేకరణ కేంద్రాలను గుర్తించి అక్కడ స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రోడ్ల నిర్మాణంలో నిర్దేశిత కాలం పాటు మన్నికగా ఉండే సాంకేతికతను వినియోగించాలని సూచించారు. వీధి దీపాల పనితీరును డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షించే విధానం అమలు చేసి, ఎక్కడైనా లోపం ఉంటే వెంటనే గుర్తించి పరిష్కరించాలన్నారు.
ఫుడ్ సేఫ్టీపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నగరంలోని అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు హోటళ్లు తీసుకుంటున్న భద్రతా చర్యలను మదింపు చేయాలని చెప్పారు.
ఫైర్ సేఫ్టీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. 50 అంతస్తులకుపైగా నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన ఆధునిక పరికరాలు, సాంకేతిక సామగ్రి సమకూర్చుకోవాలని ఆదేశించారు.
నగర కూడళ్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఆర్ అండ్ బీ తదితర శాఖల ఆధీనంలోని రోడ్లను మున్సిపల్ శాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు.
నగర రద్దీ తగ్గింపునకు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ల నమూనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన అనుమతులు, భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
నగరంలోని పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. హైడ్రా పరిరక్షణలో ఉన్న చెరువుల చుట్టూ రక్షణ చర్యలతో పాటు సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు.
సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, హైడ్రా కమిషనర్, ఎంఆర్డీసీఎల్ ఎండీ, మూడు కార్పొరేషన్ల కమిషనర్లు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Here is the complete English conversion of the Telugu headline and context shown in the image:
“Core Urban Act to Replace GHMC Act – Telangana Government Decision”
Telangana Government Plans Core Urban Act for ORR Corporations
Detailed Context in English:
The Telangana government has decided to introduce a new Core Urban Act for the three corporations located within the Outer Ring Road (ORR) limits. This new law will replace the existing GHMC Act in these areas.
The proposed Act will serve as the legal framework for permissions, fee collection, development works, sanitation management, infrastructure monitoring, food safety enforcement, fire safety regulations, and overall urban governance in the Core Urban region.