
అమరావతి మునిగిపోలేదని, అసత్య ప్రచారాలు చేస్తున్నది వైసీపీ పార్టీనే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పెద్దాపురం లో జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతూ, వైసీపీ అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Amaravati has not sunk, it is YSRCP that is sinking with false propaganda, said Andhra Pradesh Chief Minister Chandrababu Naidu. Addressing the Swarnandhra–Swachhandhra program at Peddapuram, he accused YSRCP of misleading people with baseless campaigns.
చంద్రబాబు మాట్లాడుతూ, “అమరావతి రాజధాని మునిగిపోయిందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వాస్తవానికి మునిగిపోయింది వైసీపీ పార్టీనే. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానమే రాలేదని, అందుకే ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ భూతాన్ని భూస్థాపితం చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మెరుగవుతుంది” అన్నారు.
ఆరోగ్యంపై ప్రత్యేకంగా మాట్లాడుతూ, “రాష్ట్రంలో దోమలను పూర్తిగా నిర్మూలించేందుకు ఆదేశాలు ఇచ్చాను. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులను అరికట్టేందుకు డ్రోన్లు కూడా వినియోగిస్తున్నాం. గత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోలేదు, ఫాగింగ్ వంటి చర్యలు కూడా చేయలేదు” అని పేర్కొన్నారు.
సమాజానికి సంక్షేమం రావాలంటే సంపద సృష్టించే విధానాలే అవసరమని, అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం దీర్ఘకాలం కొనసాగదని ఆయన స్పష్టం చేశారు. “సూపర్ సిక్స్” వాగ్దానాలను గుర్తు చేస్తూ, సాధ్యం కాదని అనుకున్న పనులను తాను సాధించానని తెలిపారు.
Amaravati has not sunk, it is YSRCP that is spreading false propaganda, said Andhra Pradesh Chief Minister Chandrababu Naidu. Speaking at the Swarnandhra–Swachhandhra program held at Peddapuram, he accused YSRCP of misleading people with baseless campaigns.
Chandrababu said, “YSRCP is running a false campaign claiming that the state capital Amaravati has sunk. In reality, it is YSRCP itself that has sunk. Since they could not even secure the position of the opposition in the Assembly, they are resorting to such lies. Only when YSRCP’s ghost is buried will Andhra Pradesh have a better future.”
Speaking specifically about health, he said, “I have directed officials to completely eradicate mosquitoes in the state. Diseases like malaria, dengue, and chikungunya are spreading. To tackle this, we are even using drones. The previous government did not care about public health and did not even conduct basic fogging operations.”
He further stressed that true welfare can only come through wealth creation and not by running welfare schemes on debts, which cannot last long. Referring to his “Super Six” promises, Chandrababu said he had proven that even things people thought impossible could be achieved.