బండరాయితో మోదటంతో పరిగేడుతుంటే కత్తితో భార్యను భర్త దారుణంగా పొడిచి చంపిన వైనమిది. ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
సీఐ క్యాస్త్రో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల. నివాసముంటున్న తాండూరుకు చెందిన అంబిక(27) నరేందర్ లు భార్య భర్తలు. అంబిక శ్వాస బొటిక్ షాపులో పనిచేస్తుంది. శుక్రవారం ఉదయం 11.40 సమయంలో షాప్ లో పనిచేస్తున్న సమయంలో అంబిక వద్దకు తన భర్త నరేందర్ వచ్చి బండరాయితో తలపై మొదాడు. ఈ క్రమంలో తేరుకున్న అంబిక తప్పించుకునేందుకు పరిగెత్తడంతో వెంటపడి చాకుతో దారుణంగా హత్య చేశాడు. కాగా ఏడాది కాలంగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తు లో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు.చేస్తున్నారు.