బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని విషకన్య అంటూ సంబోధించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్‌గౌడ యత్నాల్‌కు ఈసీ నోటీసులిచ్చింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నాలాయక్ బేటా అని సంబోధించిన ప్రియాంక్ ఖర్గేకు కూడా ఈసీ నోటీసులిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రియాంక్ ఖర్గే తండ్రి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ విషపామని చెప్పారు. ఆ తర్వాత తాను అన్నది నరేంద్ర మోదీని కాదని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను అన్నానని, ఎవరైనా బాధపడి ఉంటే సారీ అని ఖర్గే చెప్పారు. అయితే ఈసీ అధికారులు ఖర్గేకు మాత్రం ఇంకా ఎలాంటి నోటీసులూ జారీ చేయలేదు.