
అనకాపల్లి జిల్లా కార్యాచరణ సమావేశం
పాల్గోన్న మంత్రి కొల్లు రవీంద్ర
అనకాపల్లి
పేదరికం లేని రాష్ట్రాన్ని సాకారం చేయడమే విజన్ 2047- P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి కలక్టరేట్ సమావేశ మందిరంలో స్వర్ణంధ్ర 2047 కార్యక్రమం లో భాగంగా జిల్లా దార్శనికత కార్యాచరణ ప్రణాళిక పై జిల్లా స్థాయి కమిటీ సమావేశన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, సీ ఎస్ ఆర్ ప్రతినిధులతో జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర ఎక్సయిజ్ మారియు భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అనకాపల్లి లోకసభ సభ్యులు డాక్టర్ సీ ఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ , యల మంచిలి, మాడుగుల శాససభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, సుందరాపు విజయ్ కుమార్, జిల్లా అధికారులు హాజరయ్యారు. ముందుగా జిల్లా ప్రణాళికాధికారి జి .రామారావు ప్రభుత్వ ప్రవేటు ప్రజల భాగస్వామ్యం (పి 4) పై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఇంచార్జ్ మంత్రి, కలక్టర్, ఎం పి, శాసనసభ్యులకు వివరించారు. ఈ సందర్బంగా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ – స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో విజన్ డాక్యుమెంట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గాల వారీగా బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ఆదాయం, కుటుంబ ఆదాయాల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలపై చర్చించుకున్నామన్నారు. ప్రత్యేకంగా వ్యవసాయం, సర్వీసు, ఇండస్ట్రీ రంగాల వారిగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా సీఎం చంద్రబాబు సూచించారని ఆయన పేర్కొన్నారు.
విశాఖ జిల్లా తలసరి ఆదాయ. రూ.4లక్షలుగా ఉంటే.. అనకాపల్లి తలసరి ఆదాయం కేవలం రూ.2లక్షలకు పరిమితం కావడం బాధాకరమని, ఇంత వ్యత్యాసం ఉండటం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పి 4 కార్యక్రమం ద్వారా పేదరికంలో ఉండే వారికి ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోబోతున్నామన్నారు. అనకాపల్లి జిల్లాలో 64,518 మంది బంగారు కుటుంబాలను గుర్తించగా, లక్ష మందికి పైగా కుటుంబ సభ్యులు ఉన్నారన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటుగా ప్రైవేట్ వ్యక్తుల ప్రోత్సాహం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో తోడ్పాటు అందించడం ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందన్నారు. అనకాపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 2104 బంగారు కుటుంబాలు గుర్తించి 1700 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు. చదువుతో పాటుగా ఆర్థిక తోడ్పాటు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రపంచంలో ఎవరూ తీసుకొని వినూత్న కార్యక్రమం మన రాష్ట్రంలో రూపొందించామన్నారు. గతంలో జన్మ భూమి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం దేశ విదేశాల నుండి వచ్చారని, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ఎన్నారై లను గుర్తించి పేదరికం పట్ల పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభ్యుల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని అధికారులను ఇంచార్జ్ మంత్రి ఆదేశించారు