అతిగా సౌండ్ చేస్తే…! సైలెన్సర్ మాయమవుతుంది..! రాచకొండ పోలీసులు…

సౌండ్ చేయకు…! సైలెన్సర్ మాయమవుతుంది..!

బైక్‌పై వేగం కాదు… శబ్దం చేయాలన్న కోరికే పెరిగిపోతుందా? రాచకొండ పరిధిలో ఓ భాగం యువత మోటార్ సైకిళ్లకు అసంబద్ధమైన, శబ్దాన్ని పెంచే సైలెన్సర్‌లను అమర్చి, ఇతర వాహనదారులను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నారు.

ఈ పరిస్థితిని గుర్తించిన రాచకొండ పోలీసులు, నగరంలో ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టారు.

👉 కఠిన చర్యలు – భారీ నిఘా
పోలీసు కమిషనర్ శ్రీ జి. సుధీర్ బాబు, IPS గారి ఆదేశాల మేరకు, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) మరియు Mission LiFE ప్రచారాల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టబడ్డాయి.

విశేష డ్రైవ్‌ల సమయంలో ఇప్పటివరకు:
🔹 2325 కేసులు నమోదయ్యాయి
🔹 1297 మోడియఫైడ్ సైలెన్సర్లు స్వాధీనం
🔹 స్వాధీనం చేసిన సైలెన్సర్లను నిబంధనల ప్రకారం ధ్వంసం చేస్తున్నారు

👉 పర్యావరణ పరిరక్షణ, ప్రజల శాంతికోసం ఈ చర్యలు కీలకం.

ప్రజలు, ముఖ్యంగా యువత, అనధికారికంగా వాహనాలలో మార్పులు చేయడం కాదు… ధ్వని కాలుష్యం తగ్గించేందుకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *