కాజీపేట : బాలలను వివిధ పరిశ్రమలలో పని చేయించడానికి తరలిస్తున్న బాలలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రంకు తరలించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అనిల్ చందర్రావు తెలిపారు.:
ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాజీపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కాజీపేట విూదుగా హైదరాబాద్ న్యూఢల్లీి వెళ్లే ట్రైన్లలో అక్రమంగా తరలించే బాలలను గుర్తించాలని, వివిధ శాఖలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసుకొని సమావేశ నిర్ణయాల ప్రకారం బుధవారం రోజున దర్భంగా నుండి సికింద్రాబాద్ వళుతున్న ఎక్స్ప్రెస్ లో 34 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలియజేశారు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం సంజీవ రావు ఆధ్వర్యంలో రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం రామ్మూర్తి , ఆర్పీఎఫ్ బృందం బచ్పన్ బచావో ఆందోళన్, మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ 1098 బృందంగా ఏర్పడి కాజీపేట నుండి బల్లర్ష వరకు వివిధ ట్రైన్ లలో స్పెషల్ డ్రైవ్ చేయగా 34 మంది బాలలను వివిధ పరిశ్రమలలో పని చేయించడానికి తీసుకు వెళుతున్నట్లుగా గుర్తించిన బృందం కాజీపేట రైల్వే స్టేషన్లో సదరు పిల్లలను నిలిపివేసి వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం సంజీవరావు తెలియజేశారు సంబంధిత పిల్లల వివరాలను కనుక్కొని సదరు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు వారి నుండి వివరాలు సేకరించి వారి స్వగ్రామంలో ఉన్న వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించనున్నట్లు అప్పటివరకు తాత్కాలిక వసతి నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశాల మేరకు పిల్లలందరినీ స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలియజేశారు వీరి పూర్తి వివరాలు కనుకొని తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఇన్స్పెక్టర్ సంజీవరావు తెలియజేశారు, కాగా పిల్లలందరూ 18 సంవత్సరాల లోపు వారేనని అన్నారు, ఈ స్పెషల్ డ్రైవ్ లో బచ్పన్ బచావో ఆందోళన్ స్ట్రీట్ కోఆర్డినేటర్ అందే వెంకటేశ్వర్లు, ఏపీవో నరేష్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం మెరుగు శ్రీనివాసులు జి సునీత, చైల్డ్ లైన్ బి జ్ఞానేశ్వరి, రమేష్ , ఆర్ పి ఎఫ్ ఎస్ ఐ శ్రావణి, జి ఆర్ పి ఎస్ ఐ పరశురాము, మరియు సిబ్బంది పాల్గొన్నారు,