రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రం, గోపాలపల్లి గ్రామంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతులకు మంత్రి భరోసా కల్పించారు.