అంబేద్కర్ యూనివర్శిటీలో విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధి

అంబేద్కర్ యూనివర్శిటీలో విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధి

Ambedkar University launches stipend-based skill program for students

హైదరాబాద్: డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ చదువుతోపాటు ఉపాధిని కల్పించేలా నైపుణ్యాధారిత విద్యను అందించనుంది. ఈ క్రమంలో రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RASCI)తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో విద్యార్థులకు స్టైఫండ్ ఆధారిత అప్రెంటిషిప్ ప్రోగ్రాం (SAP) ద్వారా నెలకు రూ.7వేల నుంచి రూ.24వేల వరకు ఉపకార వేతనం లభించనుంది.

ఈ మేరకు సోమవారం జరిగిన కార్యక్రమంలో యూనివర్శిటీ వీసీ ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఈ ప్రోగ్రాం లబ్ధి చేకూరేలా కార్యాచరణ ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అర్హులు. 18-28 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చు” అని తెలిపారు.

ఈ అప్రెంటిషిప్ ద్వారా విద్యార్థులు చదువుతో పాటు పరిశ్రమలో అనుభవం పొందుతూ, ఉద్యోగ అవకాశాలను ఏర్పరుచుకునే అవకాశముందని RASCI ఎగ్జిక్యూటివ్ హెడ్ జేమ్స్ రాఫెల్ తెలిపారు. “విద్యార్థులు స్థానికంగా మాల్స్, బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇచ్చే విధంగా కోర్సులు రూపుదిద్దుకుంటాయి” అని వెల్లడించారు.

యూనివర్శిటీ అకడమిక్ డైరెక్టర్ పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ ఎల్‌వీకే రెడ్డి, EMRRC డైరెక్టర్ రవీంద్రనాథ్ సోలమన్, స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ప్రొ. పల్లవి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *