అందని ‘బంధు’వయా ! రైతులు పండిరచిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రానిపక్షంలో వాటిని నిల్వ ఉంచుకొని రుణం ఇచ్చే సౌకర్యాన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు తుంగలో తొక్కుతున్నాయి.


రైతులు పండిరచిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రానిపక్షంలో వాటిని నిల్వ ఉంచుకొని రుణం ఇచ్చే సౌకర్యాన్ని చాలావరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు తుంగలో తొక్కుతున్నాయి. కేవ లం పంట ఉత్పత్తుల ద్వారా రుసుములు వసూలు చేసుకోవడమే తప్ప వాటిపై రుణాలు ఇచ్చే రైతుబంధు పథకం అమలులో నిర్లక్ష్యం చూపుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వక, కమిటీలు సహకరించక సరుకును దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. పథకం అమలు చేయడంలో కమిటీల సిబ్బందిలో చిత్తశుద్ధితో కొరవడి నిధులు మురిగిపోతున్నాయి. పన్నెండు సంవ్సత్సరాలుగా జిల్లా పరిధిలోని ఐదు మార్కెట్‌ కమిటీల పరిధిలో నాలుగు మార్కెట్లలో ఒక్క రైతు కూడ రైతు బంధు పథకం కింద రుణం పొందలేదంటే పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుందో చెప్పకుండానే తెలిసిపోతుంది. ఒక భైంసా మార్కెట్‌ కమిటీ పరిధిలో నాలుగు సంవత్సరాల క్రితం 52 మంది రైతులకు రూ.48 లక్షలను రైతుబంధు పథకంలో రుణంగా అందించారు. రైతులు పండిరచిన వ్యవసాయోత్పత్తులు మార్కెట్‌ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచి సదరు సరుకు విలువపై 75 శాతం వరకు అంటే రూ. 2 లక్షల గరిష్ట పరిమితికి లోబడి రుణం పొందవ చ్చు. రుణంపై 180 రోజుల వరకు ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. రైతు అభ్యర్థన మేరకు 270 రోజుల వరకు సరకునిల్వ ఉంచుకోవచ్చు. దీనిపై 12 శాతం వడ్డీ వసూలు చేస్తారు. నిల్వ ఉంచిన సరకుకు భద్రతతో పాటు బీమాసౌకర్యం మార్కెట్‌ కమిటీ కల్పిస్తుంది. ఒకసారి పొందిన రైతుబంధు పథకం కార్డు మూడు సంవత్సరాల వరకు వినియోగించుకోవచ్చు. రైతు నుంచి నిల్వ ఉంచిన ఉత్పత్తులకు నామమాత్రమైన అద్దె, బీమా ప్రీమియం వసూలు చేస్తారు.
రైతుల దరిచేరని పథకం
రైతుబంధు పథకం దరి చేరకపోవడానికి ఉన్న కారణాలతో విస్తృత ప్రచారం లేకపోవడమే. గతంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు చైతన్యయాత్రలో మార్కెట్‌ కమిటీ సిబ్బంది పాల్గొని కమిటీలో రైతులకు కల్పించే సౌకర్యాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేసేవారు. మూడేళ్లుగా ప్రభుత్వపరంగా రైతు చైతన్యయాత్రలు నామ మాత్రమైన నేపథ్యంలోయు కమిటీ సిబ్బంది కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. రైతుల ఉత్పత్తులను తప్పనిసరిగా మార్కెట్‌ కమిటీల్లో విక్రయించాలి. ఇక్కడ వ్యాపారస్తుల మధ్య పోటీ మార్కెట్‌ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు కృషి చేయాలి. కాని జిల్లాలోని మార్కెట్‌ కమిటీ పాలక,అధికార వర్గాలు అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి విధానాల మూలంగా దళారులదే రాజ్యం కొనసాగు తోంది. కొన్ని ప్రాంతాల్లో పంటచేనుల్లో ఏర్పాటు చేసిన కళ్లల వద్దనే దళారులు సరుకులను తూకం వేసుకొని తరలించుకపోతున్నారు. జిల్లాలో భైంసా, నిర్మల్‌, కుభీర్‌, సారంగపూర్‌, ఖానాపూర్‌లలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి.
పంటనిల్వపై అందని రుణాలు
ఇక్కడి ప్రాంత రైతులకు గత కొంతకాలంగా బ్యాంక్‌ల ద్వారా రుణాలు సక్రమంగా అందడం లేదు. అంతేకాకుండా గత మూడు సంవ త్సరాలుగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మూలంగా ఖరీఫ్‌, రబీ సీజన్లలో పంటలు సక్రమంగా పండక రైతులు కోలుకోలేని రీతిలో నష్టా లపాలయ్యారు. ఈ ఖరీఫ్‌సీజన్‌లో పంటల పెట్టుబడికి చిల్లిగవ్వ కూడా చేతిలో లేకపోవడంతో అధికశాతం రైతులు కమీషన్‌ ఏజెంట్లు, దళా రులు, కొనుగోలుదారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి సాగుకోసం అ ప్పులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో దిగుబడుల విక్రయాల్లో దళారులు, కమీషన్‌ ఏజెంట్లు, కొనుగోలుదారులు చెప్పిన ధరలకే సరుకులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా వ్యాపారుల నుంచి రుణం తీసుకున్నందున ధర నిర్ణయంలో వారు చెప్పిందే చెల్లు బాటు అవుతోంది. ప్రతికమిటీలో అవసరాల మేరకు గోదాములు ఉన్నా రైతుబంధు పథకం అమలు చేసేందుకు సిబ్బంది ఆసక్తి చూపడం లేదు.
నామమాత్రంగా పాలకమండళ్లు
జిల్లాలో ఐదు మార్కెట్‌ కమిటీలుండగా అన్నింటికీ పాలక వర్గాల నియమాకం జరిగింది. అయితే పాలక మండళ్ల ప్రతినిధులు రైతులకు ప్రయోజకరంగానున్న రైతుబంధు పథకం అములులో చిత్తశుద్ది చూపడం లేదు. రైతులకు సంబంధిత పథకం గూర్చి అవగాహన కల్పించి చైతన్యపరచడంలో పాలక మండళ్లు విఫలమవుతున్నాయి. ప్రతిమూడు నెలలకోమారు జరిగే మండల పరిషత్‌ సర్వ సభ్య సమా వేశాల్లో పాల్గొనే ప్రజాప్రతినిధులకు సంబంధిత పథకంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వారి ద్వారా గ్రామాల్లో రైతుబంధు పథకంపై ప్రచారం కల్పించేందుకు అవకాశమున్న ఎక్కడి కూడా ఇది జరుగడం లేదు.
నిధులున్నా నిర్లక్ష్యమే
జిల్లాలోని కమిటీల్లో పన్నులరూపంలో వసూలు చేసిన కోట్లాది రూ పాయలు ఉప ఖజానాలలో నిల్వలు ఉన్నాయి. గత అర్థిక సంవత్సరములో జిల్లాలోని ఐదు మార్కెట్‌ కమిటీల్లో ఒక్క మార్కెట్‌ కమిటీ కూడా వార్షిక ఆదాయలక్ష్యాన్ని చేరుకోలేదు. అయినప్పటికీ ఆశాజనకమైన ఆదాయం మాత్రం సమకూరింది. ప్రతీ మార్కెట్‌ కమిటీ పరిధిలో కోట్లాది రూపాయల నిల్వలు ఉన్నప్పటికి రైతుబంధు పథకం అమలు చేయడంలో తాత్సారం చేస్తుండడంతో కమిటీలు ఏర్పాటు చేసిన ఉద్దేశం నెరవేరకుండా పోతోంది.
ప్రచారం లేకనే పథకం అమలులో జాప్యం
మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు రుసుముల లక్ష్యాన్ని సమీక్షిస్తున్నారే కాని రైతులకు ఉద్దేశించిన పథకాల అమలు గురించి చర్చించిన దాఖలాలు లేవు. కమిటీల్లో శాశ్వత సిబ్బంది కన్నా తాత్కాలికంగా పొరుగుసేవల్లో పనిచేస్తున్నవారే ఎక్కువసంఖ్యలో ఉన్నారు. దాంతో అధికారులు కూడా రుసుముల వసూళ్లకు వీరిని వినియోగిస్తున్నారే తప్ప సంక్షేమ పథకాల వైపు వెళ్లనీయడం లేదు. మార్కెట్‌ కమిటీల్లో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేయాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రత్యేకంగా చైతన్యయాత్రలు నిర్వహించాలి. అందుకు ప్రస్తుతం ఉన్న సిబ్బందికి తోడు అదనంగా ఉద్యోగులను నియమించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *