. Amid rising global tensions, gold and silver prices have surged sharply, with gold crossing ₹1.73 lakh per 10 grams and silver touching ₹3.25 lakh per kg in Telugu states.

అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం రూ.1.73 లక్షలు దాటగా, వెండి కిలో రూ.3.25 లక్షలకు చేరింది. Amid rising global tensions, gold and silver prices have surged sharply, with gold crossing ₹1.73 lakh per 10 grams and silver touching ₹3.25 lakh per kg in Telugu states.
అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులవైపు మొగ్గుచూపుతున్నారు. దీని ప్రభావంతో గోల్డ్, సిల్వర్ ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది.
Following escalating tensions in West Asia and joint military actions by the US and Israel, global investors are shifting towards safe-haven assets. This has triggered a sharp rise in gold and silver prices across international markets.
గత మూడు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.10,000కు పైగా పెరిగింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.4,370 పెరుగుదల చోటు చేసుకోగా, 22 క్యారట్ల బంగారం ధరపై రూ.4,000 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 122 డాలర్లు పెరిగి ప్రస్తుతం 5,043 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
In just three days, gold prices have risen by over ₹10,000 per 10 grams. As per Sunday morning data, 24-carat gold (10 grams) increased by ₹4,370, while 22-carat gold rose by ₹4,000. In the international market, gold gained $122 per ounce, trading at $5,043 per ounce.
వెండి ధర కూడా గణనీయంగా పెరిగింది. ఆదివారం కిలో వెండిపై రూ.5,000 పెరుగుదల నమోదైంది. శని, ఆదివారాల్లో కలిపి కిలో వెండిపై సుమారు రూ.30,000 పెరుగుదల చోటు చేసుకుంది.
Silver prices also witnessed a strong rally. On Sunday alone, silver gained ₹5,000 per kg. Over the weekend, prices surged by nearly ₹30,000 per kg.
తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,73,080కు చేరింది. 22 క్యారట్ల బంగారం రూ.1,58,650 వద్ద కొనసాగుతోంది. వెండి కిలో ధర ఈ నగరాల్లో రూ.3,25,000కు చేరింది.
In major cities of the Telugu states including Hyderabad, Vijayawada and Visakhapatnam, 24-carat gold (10 grams) is priced at ₹1,73,080, while 22-carat gold stands at ₹1,58,650. Silver is trading at ₹3,25,000 per kg in these cities.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ.1,73,230కు చేరగా, 22 క్యారట్ల బంగారం రూ.1,58,800 వద్ద ఉంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 24 క్యారట్ల బంగారం రూ.1,73,080, 22 క్యారట్లు రూ.1,58,650గా నమోదైంది. చెన్నైలో కూడా ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,95,000 వద్ద ఉంది.
In New Delhi, 24-carat gold (10 grams) is priced at ₹1,73,230 and 22-carat gold at ₹1,58,800. Mumbai and Kolkata report ₹1,73,080 for 24-carat and ₹1,58,650 for 22-carat gold. Chennai mirrors similar trends. Silver prices in Delhi, Mumbai, Bengaluru and Chennai stand at ₹2,95,000 per kg.
గమనిక: పై పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలో నమోదైనవి మాత్రమే. గోల్డ్, సిల్వర్ ధరలు రోజంతా మారుతూ ఉంటాయి.
Note: The above prices are recorded at the time of morning market opening and are subject to fluctuation throughout the day.